PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎగిరే హెలికాప్ట‌ర్ పై పుల‌ప్స్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎగురుతున్న హెలికాప్ట‌ర్ పై వేలాడుతూ పులప్స్ సాహసాన్ని చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించారు డచ్‌ ఫిట్‌నెన్‌ ఇన్‌ఫ్లూయెర్స్‌ స్టాన్‌ బ్రూనింక్‌. యూట్యూబ్‌లో ఫిట్‌నెస్‌ చానల్‌తో స్టాన్‌ బ్రౌనీగా పాపులర్‌ అయిన బ్రూనింక్‌… అతని కోహోస్ట్‌–ఆర్జెన్‌ ఆల్బర్స్‌.. ఇద్దరూ బెల్జియమ్, ఆంట్‌వెర్ప్‌లోని హోవెనన్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో గిన్నిస్‌ అధికారుల సమక్షంలో వరల్డ్‌ ఫీట్‌ కోసం ప్రయత్నించారు. నిమిషానికి 25 పులప్స్‌తో బ్రూనింక్‌ రికార్డును నెలకొల్పాడు. అది కూడా రెండు సార్లు. ఇక మొదట 24 పులప్స్‌ చేసిన ఆల్బర్స్‌ అంతకుముందు 23 పులప్స్‌తో ఉన్న ఓ రోమెనియన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. తరువాత బ్రూనింక్‌ 25 పులప్స్‌తో ఆ రికార్డునూ బద్దలు కొట్టాడు.

                                                

About Author