‘పంచ్ ప్రభాకర్’ ని 10 రోజుల్లో అరెస్ట్ చేయాలి : హైకోర్టు
1 min readపల్లెవెలుగు వెబ్: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల పై అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టులు చేసిన పంచ్ ప్రభాకర్ ను పది రోజుల్లో అరెస్టు చేయాలని సీబీని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు సరైన రీతిలో సాగుతోందన్న సదుద్దేశాన్ని రుజువు చేసుకోవాలని తెలిపింది. అందులో విఫలమైతే సిబిఐకి దర్యాప్తు చేతకావడంలేదని భావించి సిట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యాన్ని కోరుతూ నివేదిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు పై పూర్తీ వివరాలతో నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్ ను ఆదేశించింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.