NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అశ్రు నయనాలతో ముగిసిన పునీత్ అంత్యక్రియలు

1 min read

పల్లెవెలుగు వెబ్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్​కుమార్ అంత్యక్రియలు అశేష జనవాహిని మధ్య ముగిశాయి. తెల్లవారుజామున 5 గంటలకు అంతిమయాత్ర… కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు సాగింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు. కడసారి వీడ్కోలు పలకడానికి సినీ తరాలు తరలివచ్చారు. కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఈయన అంత్యక్రియలు జరిగాయి. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై.. పునీత్ పార్థివ దేహానికి సెల్యూట్ చేశారు. పునీత్ భార్య అశ్విన్, ఇద్దరు పిల్లలు, కుటంబ సభ్యులు, వేలాది మంది అభిమానులు…. అశ్రునయనాలతో కన్నడ పవర్ స్టార్‌కు తుది వీడ్కోలు పలికారు.

About Author