PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతుల నుండి మద్దతు ధరకు కందులు కొనుగోలు

1 min read

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లాలో మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతుల నుండి మద్దతు ధరకు కందులు కొనుగోలు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా లోని  కందుల కొనుగోలు పై జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి లతో కలిసి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మార్క్ఫెడ్ సంస్థ ద్వారా జిల్లాలో కంది పంట సాగు చేసిన రైతుల నుండి కందులను  మద్దతు ధరకు కొనుగోలు చేయుటకు అనగా ఏ రోజు కొనుగోలు రేటు ఆరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. రైతులు తాము పండించిన కంది పంటను ప్రభుత్వం వారికి అమ్మదలచినచో సదరు  రైతు భరోసా కేంద్రమును సంప్రదించి పంట అమ్మకానికి సంబంధించి రైతులు నమోదు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతులకు అదనపు ప్రయోజనాలు అనగా గోని సంచులు, కళ్ళంలో సంచులను నింపి మరియు లోడింగ్ చేయడానికి అవసరమైన కూలీ చార్జీలు మరియు రవాణా చార్జీలను కూడా ప్రభుత్వమే భరించి రైతుల నుండి కొనుగోలు చేయబడుననే విషయాన్ని కూడా వారికి చెప్పాలన్నారు.  అదేవిధంగా రైతులు  తాము పండించిన  పంటను దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం వారికి అమ్మి మద్దతు ధరను పొందవలసినదిగా జాయింట్ కలెక్టర్ తెలియజేశారు.జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కంది పంట సాగు చేసిన రైతులు నష్టపోకుండ మార్కెట్ రేటు తోనే కందులు కొనుగోలు చేసేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ని కోరినారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి ఎల్ వరలక్ష్మి, సివిల్ సప్లై డి ఎం షర్మిల, మార్క్ఫెడ్ డి ఎం రాజు, తదితరులు పాల్గొన్నారు.

About Author