మద్దతు ధరపై జొన్న పంట కొనుగోలు
1 min read– వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనుగోలు
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలో మద్దతు ధరపై శరవేగంగా జొన్న పంట కొనుగోలు గడివేముల మండలానికి సంబంధించి ఆరు RBK కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు మొదలుపెట్టారు. మద్దతు ధర క్వింటాల్కి 2970. అదనంగా క్వింటాల్కి లేబర్ చార్జెస్ కింద 22 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు. రైతుల వద్ద ఉన్నటువంటి జొన్న పంట అంతా కూడా ప్రభుత్వము మద్దతు ధరపై కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు .కాబట్టి మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తిరిగి రైతులకే బియ్యానికి బదులుగా జొన్నలు ఇవ్వడం జరుగుతుందని .కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలిపారు .ఈరోజు నంద్యాల ఏడిఏ రాజశేఖర్ పెసర వాయి , కరి మద్దెల గ్రామాలలోని జొన్న పంటకు సంబంధించి శాంపిల్స్, క్వాలిటీ చెకప్ చేయుట, కొంత స్టాక్ ను సిడబ్ల్యుసి గోడౌన్ కు పంపే దానికి పర్యవేక్షించడానికి రైతు సోదరులకు అవగాహన కల్పించారు.