NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొనుగోళ్ల జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగు వెబ్​:భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. అంత‌ర్జాతీయంగా సానుకూల సంకేతాల నేప‌థ్యంలో సోమ‌వారం నాటి న‌ష్టాల నుంచి కోలుకున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం సూచీలు లాభాల్లో ప్రారంభ‌మై చివ‌రి వ‌ర‌కు పాజిటివ్ గానే కొనసాగాయి. క‌రోన వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనుకున్నంత ప్రమాద‌క‌రం కాద‌న్న వార్తలు వ‌స్తున్నాయి. దీంతో అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అదే దారిలో ఏసియా మార్కెట్లు కూడ ప‌య‌నించాయి. యూర‌ప్ మార్కెట్లు కూడ పాజిటివ్ గా మొద‌ల‌య్యాయి. మ‌రోవైపు ఆర్బీఐ మానిట‌రీ పాల‌సీ మీటింగ్ జ‌రుగుతోంది. దీంతో సూచీల్లో కొనుగోళ్ల జోరు క‌నిపించింది. సెన్సెక్స్ 886 పాయింట్ల లాభంతో 57633 వ‌ద్ద, నిఫ్టీ 264 పాయింట్ల లాభంతో 17176 వ‌ద్ద‌, బ్యాంక్ నిఫ్టీ 882 పాయింట్ల భారీ లాభంతో 36618 వ‌ద్ద క్లోజ్ అయింది.

About Author