NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`పుష్ప‌` మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ .. ఎలా ఉందంటే ?

1 min read
                                  

ప‌ల్లెవెలుగువెబ్ : అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం పుష్ప‌. ఈ సినిమా నేడే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు అల్లు అర్జున్‌ నటనే హైలెట్‌ అని చెబుతున్నారు. టైటిల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి పుష్పపై అంచనాలు పెరిగాయి. అల్లు అర్జున్‌ తొలిసారి పాన్‌ ఇండియా చిత్రం చేయడం.. దాన్ని సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటంతో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. పుష్ప సినిమాకు సంబంధించి ట్విట్ట‌ర్ రివ్యూ వ‌చ్చేసింది. సినిమాలో బ‌న్ని వన్‌మ్యాన్‌ షో చేశాడని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. అలాగే యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయి అంటున్నారు. బన్నీ తప్ప ఎవరూ కనిపించలేదని ఇంకొకరు ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా బావుందని… చిత్తూరు యాసలో చిట్టకొడుతున్నాడని ఒకరు పేర్కొన్నారు.

About Author