నన్ను జైల్లో పెట్టండి.. బీజేపీకి ఉద్దవ్ సవాల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే బీజేపీకి సవాల్ విసిరారు. అధికారంలోకి రావాలనుకుంటే రావొచ్చని, అంతే కానీ దుర్మార్గాలకు పాల్పడొద్దని భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే శుక్రవారం విమర్శలు గుప్పించారు. తాజాగా ఉద్ధవ్ బావమరిదిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి 6.45 కోట్ల రూపాయలను ఆస్తులను జప్తు చేసింది. ఇది జరిగిన రెండు రోజుల అనంతరం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ తనను జైల్లో పెట్టాలనేదే బీజేపీ లక్ష్యమైతే పెట్టండంటూ సవాలు విసిరారు.