రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టండి..! మోడీ, అమిత్‌షాలకు బాబు లేఖ
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అమలు చేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖమంత్రి అమిత్‌షాలకు లేఖ రాశారు. వైసీపీ శ్రేణులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలపై మూకుమ్మడి దాడికి పాల్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో అచారక పలన సాగుతోందని, పోలీసులు, ప్రభుత్వం ఉగ్రవాద తరహా దాడులు చేయిస్తున్నారంటూ చంద్రబాబు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాలకు వివరించారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. టీడీపీ నేతలకు, పార్టీ కార్యాలయాలకు కేంద్రబాలగాలతో భద్రత కలిపంచాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.