NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అణ్వాయుధ ద‌ళాలు అప్ర‌మత్తం కావాల‌న్న పుతిన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో తమ అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించడం కలకలం రేపుతోంది. యుద్ధంలో అణ్వాయుధాల వినియోగం జరిగే అవకాశం ఉందనే అనుమానంతో యూఎన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కమిటీ అత్యవసర సమావేశం బుధవారం జరగనుంది. 35 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మరోవైపు అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉండాలని పుతిన్ ఆదేశించడం ప్రమాదకరమని, బాధ్యతారాహిత్యమని నాటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్ బర్గ్ చెప్పారు.

                                           

About Author