PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిట్ట గూడే… మాస్క్​

1 min read

– తాత ప్లాన్​ అదుర్స్​
పల్లెవెలుగు వెబ్​, మహబూబ్​నగర్​ : దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న క్రమంలో ఓ వృద్దుడి ప్లాన్​… అందరికీ ఆదర్శంగా నిలిచింది. కొందరు మాస్క్​ ధరించడానికే సిగ్గు, నిర్లక్ష్యం, అహంకారంతో.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కానీ ఈ తాత మాస్క్​ చూస్తే.. ప్రతిఒక్కరూ మాస్క్​ ధరించాలనిపించడం ఖాయం. మహబూబ్​నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఓ తాత గిజిగాడి పిట్టగూడునే మాస్క్​ ధరించాడు. పొలం దగ్గర నుంచి నేరుగా పింఛన్​ తీసుకునేందుకు రావడంతో చూపరుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కొందరు తాతతో సెల్ఫీలు తీసుకోగా.. మరికొందరు పిట్టగూడును మాస్కును ఫోటోలు తీసుకుంటున్నారు. తాత పిట్టగూడు మాస్క్​.. ప్రస్తుతం వైరల్​ అవుతోంది.

About Author