భావితరాలకు…నాణ్యమైన విద్య
1 min readఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి
పల్లెవెలుగు వెబ్, ఏలూరు:కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి అధునాతన సౌకార్యాల తో కూడిన తరగతి గదులలో విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించాలన్నదే సి ఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి అన్నారు.పెదవేగి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 81.50 లక్షల ప్రభుత్వానిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల ను ఎం పి పి తాతా రమ్య కుమార్ తో కలిసి గురువారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలను అదునాతన సౌకర్యాలతో నిర్మించిందన్నారు.కార్పొరేట్ పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ప్రవేశపెట్టిందనిచెప్పారు.నాడు నేడు ద్వారా పాఠశాలలలో మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు.పౌష్టిక ఆహారం.ప్లే గ్రౌండ్స్.విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ విద్యారంగం లో అధునాతన మైన మార్పులు తీసుకువచ్చి ఏపీ ని వి వి ద రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమం లో పెదవేగి సొసైటీ చైర్ పర్సన్ పి వి సుబ్బారావు. దెందులూరు ఏ ఎం సి చైర్మన్ మెకాలక్ష్మణరావు.డి సి సి బి డైరెక్టర్ పెదవేగి మాజీ సర్పంచ్ తాతా సత్యనారాయణ.ఎం ఈ ఓ బుధవ్యాస్. ఆర్ గంగాధర్. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.