వైసీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే ప్రజలకు నాణ్యమైన వైద్యం
1 min readవైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సీఎం జగన్.
వై ఎస్ ఆర్ విలేజ్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో ఎంఎల్ఏ ఆర్థర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వైద్యరంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని నందికొట్కూరు ఎంఎల్ఏ తొగురు ఆర్థర్ అన్నారు. జూపాడు బంగ్లా మండలం తూడిచెర్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కింద మంజూరు చేసిన నిధులు రూ 20 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులు, రూ. 20.80 లక్షల తో నిర్మించిన డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవమును గురువారం నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2500 జనాభాకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లును ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లును నియమించారన్నారు. ఈ క్లినిక్ లో12 రకాల వైద్యసేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంటుందన్నారు.ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటివద్దకే నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలుతో ప్రజల చెంతకే వైద్యం అందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల మద్దిలేటి , మండల ఎంపీపీ సువర్ణమ్మ , తహసీల్దార్ పుల్లయ్య యాదవ్ , మండల ఇంచార్జి అభివృద్ధి అధికారి నూర్జహాన్ , వైద్య అధికారి డా. మౌనిక , మెడికల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. కాంతారావు , మండల వ్యవసాయ అధికారి కృష్ణా రెడ్డి , గ్రామ వైసీపీ నాయకులు పద్మనాభయ్య శెట్టి , కోట్ల మొక్షేశ్వర రెడ్డి , సత్య నారాయణ శెట్టి ,పీఆర్ డీఈ ధనిబాబు , ఏఈ బషీర్ , వైసీపీ నాయకులు రవి, మధు, శివానంద రెడ్డి, దేవ సహాయం, ఉస్మాన్ భాష, తిరుపతయ్య, అలగనూరు వెంకట సుబ్బయ్య, వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది, ప్రభుత్వ శాఖల సిబ్బంది, గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.