NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీ నేత‌ల దిగ్భంధం.. చేతులెత్తి మొక్కడంతో !

1 min read

పల్లెవెలుగు వెబ్​: హ‌ర్యాణాలోని రోహ్ త‌క్ జిల్లా కిలోయిలో బీజేపీ నేత‌ల‌ను రైతులు దిగ్బంధించారు. ప్రధాని మోదీ కేధార్ నాథ్ ప‌ర్యట‌న ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో చూసేందుకు బీజేపీ నేత‌లు ఓ ఆల‌యానికి వెళ్లారు. సాగు చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా నిర‌స‌న వ్యక్తం చేస్తున్న రైతుల‌పై దుర్భాష‌లాడారంటూ బీజేపీ మాజీ మంత్రి మ‌నీష్ గ్రోవ‌ర్ ల‌క్ష్యంగా బీజేపీ నేత‌ల‌ను రైతులు దిగ్భందించారు. 8 గంట‌ల పాటు వారిని కద‌ల‌కుండా చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నా రైతులు విన‌లేదు. మాజీ మంత్రి మ‌నీష్ గ్రోవ‌ర్ క్షమాప‌ణ చెప్పడంతో రైతులు బీజేపీ నేత‌ల‌ను విడిచిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. క్షమాప‌ణ చెప్పార‌న్న వార్తల‌పై మ‌నీష్ గ్రోవ‌ర్ స్పందించారు. క్షమాప‌ణ చెప్పార‌న్న వార్తల‌ను ఆయ‌న ఖండించారు.

About Author