PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ ఇక లేరు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌-2 ఇక లేరు. ఆమె వయసు 96 ఏళ్లు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ క్యాసల్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ.. గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరున్న బ్రిటన్‌కు సుదీర్ఘకాలం సేవలందించిన రాణిగా.. ప్రపంచంలోనే సుదీర్ఘంగా పరిపాలించిన రెండో నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. వేసవి విడిది నిమిత్తం లండన్‌లోని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ క్యాసల్‌కు వెళ్లారు. అక్కడే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో.. తిరిగి లండన్‌కు రాలేదు. అధికారిక పర్యటనలు, ప్రయాణాలను మానుకున్నారు.

                                          

About Author