రాయలసీమ హక్కుల సాధన కోసం.. ‘ఆర్జేఏసీ’ పోరాటం..
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాయలసీమ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు ఆర్జేఏసీ నాయకులు. ఆదివారం కర్నూలు నగరంలోని వివిధ కేంద్రాలలో రాయలసీమ హక్కులకై ఆర్ జేఏసీ పోరాటం కరపత్రం,గోడ పత్రికల ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో రాయలసీమ ఉద్యమ సీనియర్ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, అమడగుంట్ల కృష్ణారెడ్డి, రాయలసీమ విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు సీమక్రిష్ణ, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి అధ్యక్షులు రవికుమార్,రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ రాజు, అమడగుంట్ల గిరిధర్, పత్తికొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ క్రాంతి నాయుడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ హక్కులైన రాజధాని, గుంతకల్ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ, చిత్తూరు జిల్లాకు ఐటీ హబ్, విశ్వవిద్యాలయాలు, రాయలసీమకు నాలుగు వందల టియంసీ ల నీటివాట,జీవో 69 రద్దు,వలసల నివారణ, రైతులు ఆత్మహత్యలు నివారణ, పరిశ్రమల స్థాపన, కృష్ణానది యాజమాన్య బోర్డు తదితర అంశాలపై ప్రజలను, యువత, విద్యార్థులను చైతన్యం చేసి రాయలసీమ హక్కుల విషయంలో రాజీలేని పోరాటాలకు సిద్దంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాయలసీమ విద్యార్థి పోరాట సమితి, రాయలసీమ విద్యార్థి సమాఖ్య నాయకులు అశోక్,నల్లారెడ్డి,తెర్నెకల్ రవి, రమేష్ గౌడ్ , బాలు,వసంత్, సురేష్, రహీం తదితరులు పాల్గొన్నారు.