NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీ నేత ఇంట్లో రాస‌లీల‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మేఘాలయ బీజేపీ ముఖ్య నేత అకృత్యాలు బయటకు రావడంతో సంచలనంగా మారింది. తన ఫామ్‌ హౌసులో గుట్టుగా వ్యభిచార గృహం నిర్వస్తున్న బీజేపీ నేత బెర్నార్డ్‌ మరాక్‌.. అలియాస్‌ రింపు గుట్టురట్టు అయ్యింది. మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్‌ మరాక్‌.. వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలోని ఉన్న తన ఫాంహౌసు​లో గుట్టుగా సెక్స్‌ రాకెట్‌ను నడుపుతున్నాడు. ఈ మేరకు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శనివారం పోలీసులు ఆకస్మిక రైడ్స్‌ చేశారు. దాడుల్లో భాగంగా.. ఐదుగురు చిన్నారులను రక్షించినట్టు వెస్ట్‌ గారో హిల్స్‌ జిల్లా ఎస్పీ వివేకానంద్‌ సింగ్‌ వెల్లడించారు. వారిలో నలుగురు బాలురు, ఒక అమ్మాయి ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో వ్యభిచార దందాతో సంబంధం ఉన్న 73 మంది అరెస్ట్‌ చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. వారిలో 23 మంది మహిళలు ఉన్నారు.

                                         

About Author