రాహుల్ గాంధీ టీ షర్ట్ పై రగడ
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ధరపై రగడ మొదలైంది. బర్బెర్రీ బ్రాండ్‌కు చెందిన టీ షర్ట్.. 41 వేల 257 రూపాయలు. ఇదీ ధరించి రాహుల్ పాదయాత్ర చేస్తున్నాడని, అదే టీ షర్ట్‌తో ఆయన తిరునల్వేలిలో మీడియాతో మాట్లాడారని బీజేపీ ఆరోపించింది. ఖరీదైన దుస్తులు ధరించి రాహుల్ ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి మాట్లాడుతారా అని బీజేపీ సెటైర్లు వేసింది. ఖరీదైన దుస్తులు ధరించే నాయకుడికి నిరుపేదల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నిస్తోంది. యాత్ర కోసం రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు ఉపయోగిస్తున్న కంటైనర్లు కూడా విలాసవంతంగా ఉన్నాయని బీజేపీ విమర్శించింది.