కేసీఆర్ జాతీయ పార్టీ పై రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్య !
1 min readపల్లెవెలుగువెబ్ : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టే దిశగా సాగుతున్న తీరుపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. జాతీయ పార్టీ పెట్టొద్దని కేసీఆర్‌ను ఎవరు ఆపారని ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ పెట్టుకోండి.. వీఆర్ఎస్ కూడా తీసుకోండి’ అని వ్యాఖ్యానించారు. లేదంటే ఫాం హౌస్‌కు పరిమితమైనా తమకేమీ అభ్యంతరం లేదని కూడా ఆయన అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలవాలని అడుగుతున్నారన్న ఆయన.. హైదరాబాద్ సంస్థానంలోని పాత ప్రాంతాలను తిరిగి తెలంగాణలో కలుపుతూ తీర్మానం చేయండి అని సూచించారు.