జగన్ కు రఘురామ డెడ్ లైన్.. లేదంటే ..?
1 min read
పల్లెవెలుగు వెబ్: నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు డెడ్ లైన్ విధించారు. ఈ మేరకు జగన్ కు రఘురామ లేఖ రాశారు. వైసీపీ ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని లేఖలో పేర్కొన్నారు. తాను వైసీపీ ఎంపీ కాదా? అంటూ ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేస్తే తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. సీఎం జగన్ 48 గంటల్లో తన లేఖకు వివరణ ఇవ్వకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించాలని స్పీకర్ ను కోరుతానని తెలిపారు. రఘురామ సీఎం జగన్ కు వరుస లేఖలు రాస్తున్నారు. ఆ లేఖలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం జగన్ ని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. రఘరామకృష్ణరాజును అనర్హుడిగా ప్రకటించాలని ఎంపీ మార్గాని భరత్ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు.