NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాక్షి మీడియాకు ర‌ఘురామ లీగ‌ల్ నోటీస్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు సాక్షి మీడియా గ్రూప్ కు లీగల్ నోటీసు పంపారు. త‌న పైన త‌ప్పుడు క‌థ‌నాలు ప్రచారం చేశారని, అందుకుగాను భేష‌ర‌తుగా క్షమాప‌ణ చెప్పాల‌ని కోరారు. సాక్షి మీడియా క‌థ‌నాల వ‌ల్ల త‌న ప్రతిష్ఠకు భంగం క‌లిగింద‌ని ఆయ‌న తెలిపారు. వారం రోజుల్లో స‌మాధానం ఇవ్వాల‌ని, లేనిప‌క్షంలో చ‌ట్టప‌రంగా ముందుకు వెళ్తాన‌ని నోటీసులో ఆయ‌న పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం క‌లిగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌తో ఇటీవ‌ల ర‌ఘురామ‌కృష్ణ రాజును సీఐడీ పోలీసులు ఆరెస్టు చేశారు. అనంత‌రం క‌స్టడీలో త‌న‌ను కొట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ విష‌యంలో సుప్రీం కోర్టు ర‌ఘురామ‌కృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే.

About Author