NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఈలపాట రఘురామయ్య జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈలపాట రఘురామయ్య గారి జయంతిని ఘనంగా జరుపుకున్న రంగస్థల కళాకారులు ,, ఈరోజు రంగస్థలంకళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలుగు తోట మధుర నగర్ నందుఈలపాట రఘురామయ్య గారి జయంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుర్రపుశాల అంకయ్య ,జనరల్ సెక్రటరీ పి హనుమంతరావు చౌదరి, షఫీ ఉల్లా,ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ ,రోషన్ అలీ, సభ్యులు,మనోహర్ బాబు, హార్మోనిస్ట్ వెంకటస్వామి, తబలిస్టు రాముడు ,జయరాముడు, నాగరాజు మొదలగు కళాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ రఘురామయ్యగారికి నేను ఏకలవ్య శిష్యుని ఆయనను చూసి నేను ఈలపాట నేర్చుకుని రఘురామయ్య అవార్డును పొందాను అన్నారు, హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ ఈలపాట రఘురామయ్య గారు తాడిపత్రిలో జన్మించి లాయరు వృత్తిలో గడించి రంగస్థలంలో నటించి పేరు ప్రఖ్యాతలుగాంచి సినిమాలలో నటించి అందరికంటే ముందుగా సినిమాలలో కృష్ణుడు వేషం ధరించినటువంటి రఘురామయ్య గారు ఆయన గారి నటన ఆయన గారు ఈలపాట ,వారికి వారే సాటిఅని, ఆయనకి ఎన్నో బిరుదులు ఇచ్చారు బళ్లారి రాఘవ, ఆంధ్ర రఘురామయ్య ,మరియు ,ఆంధ్ర కర్ణాటక ,తమిళనాడు ,బొంబాయి ఢిల్లీ, ఇండియాలోనే ఒక పేరు పొందిన ,రంగస్థల ,సినిమా ,కళాకారుడు, కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి,నందమూరి తారక రామారావు గారు ,రఘురామయ్య గారి పేరున ఒక అవార్డును ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రంగస్థలం కళాకారులకు ఇచ్చి గౌరవించే విధంగా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క కళాకారుడు భవిష్యత్తులో రఘురామయ్యగారిని ఆదర్శంగాతీసుకొని నడుచుకోవాలని వారికున్నటువంటి గౌరవ మనం కూడా అలవర్చుకోవాలని కళాకారులకు ,ఉన్నటువంటి ,గౌరవం ,ప్రపంచంలో ,ఎవరికీ ,లేదని , కళాకారులు క్రమశిక్షణ,నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ ,మంచి అలవాటులతో ,నడుచుకోవాలని,హనుమంతరావు చౌదరి అన్నారు.

About Author