PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రగులుతున్న మిడుతూరు రాజకీయం…

1 min read

-టిడిపి నాయకులు శిలాఫలకం ప్రారంభం

-వారు ఎలా ప్రారంభిస్తారు అంటున్న అధికార పార్టీ

-ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిప్పులు చెరుగుతున్న రాజకీయం

పల్లెవెలుగు  వెబ్ మిడుతూరు: టిడిపి నాయకులు సీసీ రోడ్డు శిలాఫలకాన్ని ప్రారంభిస్తే వారు ఎలా ప్రారంభిస్తారు అంటున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో రాజకీయం రసకందాయంలో ఉందనే చెప్పవచ్చు.వివరాల్లోకి వెళితే

సీసీ రోడ్డును ప్రారంభించిన టిడిపి నాయకులు

మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో ఈనెల 15వ తేదీ సోమవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ రమణమ్మ(టిడిపి సర్పంచ్)మరియు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి రోడ్డు శిలాఫలకాన్ని వారు ప్రారంభించారు.గ్రామ పంచాయితీ 15వ ఆర్థిక సంఘం 6 లక్షల నిధుల ద్వారా గ్రామంలో గత రెండేళ్ల కిందట రహదారిని వేయించారు. శిలాఫలకంలో మొదటగా ముఖ్య అతిథులు మాండ్ర శివానందరెడ్డి,రెండవ పేరు రహదారి ప్రారంభకులు గ్రామ సర్పంచ్ రమణమ్మ,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి పేర్లు శిలాఫలకంపై ఉన్నాయి.

భగ్గుమన్న అధికార పార్టీ నేతలు

గురువారం ఉదయం మండల సర్వసభ్య సమావేశం హాల్లోకి రాకుండా నేరుగా ఎంపీపీ కార్యాలయానికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మతో పాటు జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి,సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,మల్లు శివ నాగిరెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఎంపీటీసీలు నాయకుల తో పాటు ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,పంచాయతీ రాజ్ డిఈ ఘ ని బాబు,ఈఓఆర్డి ఫక్రుద్దీన్, ఎంపీపీ హాల్లో ఉన్నారు. చింతలపల్లిలో టిడిపి నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటే మీరేమి చేస్తున్నారు ప్రోటోకాల్ ప్రకారం మండల ప్రజా ప్రతినిధులకు చెప్పాల్సిన బాధ్యత లేదా గ్రామంలో టిడిపి నాయకులు వారి 8 ఇండ్లకు త్రాగునీటి ట్యాంక్ నుండి నేరుగా పైపులు వేసుకుంటే వారి పైన చర్యలు తీసుకోరు.పైపులైను కొరకు 2 లక్షల 50 వేలు ఖర్చు చేస్తే బిల్లు మంజూరు కొరకు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు అంటూ ప్రజా ప్రతినిధులు అధికారులపై నిప్పులు చెరిగారు.ప్రజా ప్రతినిధులు కాని వారు ప్రారంభోత్సవాలు ఎలా చేస్తారు శిలాఫలకంలో వారి పేర్లు ఎలా ఉంటాయి వారి పైన మీరేం చర్యలు తీసుకున్నారు..    మాటల తూటాలతో గది మార్మోగింది.శిలాఫలకం ప్రారంభోత్సవం నాకు తెలియదు తర్వాత నా దృష్టికి వచ్చింది నేను వెంటనే అధికారులతో విచారణ చేపట్టి నివేదికను జిల్లా అధికారులకు పంపించాను నా పరిధిలో చేయాల్సిన వాటిని నేను చేశాను నా పరిధి దాటి నేను చెయ్యలేను ఏమైనా చెయ్యాలంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తా అంటూ ఎంపీడీఓ దీటుగా సమాధానం ఇచ్చారు.మధ్యాహ్నం వరకు ఎంపీపీ హాల్లో భోజనా నంతరం  ఎంపీడీవో హాల్లో సాయంత్రం దాకా అధికారులతో ప్రజా ప్రతినిధులు విషయాలపై  ఘాటుగా చర్చించారు.

సమస్యలు పరిష్కరించే దాకా మేము రాలేముచింతలపల్లి గ్రామంలో ఉన్న సమస్యలను నెరవేర్చే దాకా మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అందరం కూడా మండల సమావేశానికి రాము రాలేమని ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మతో మరియు ఎంపీడీఓ తో ప్రజా ప్రతినిధులు అన్నారు.ఆదేశాలు వస్తే శిలాఫలకాన్ని తొలగిస్తాంగ్రామాల్లో ఏమి ప్రారంభించాలన్నా మండల ప్రజా ప్రతినిధులకు అధికారులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది.కానీ వారు అలా సొంత నిర్ణయాలతో ప్రారంభించకూడదని దీనిపై  జిల్లా పంచాయితీ అధికారికి నివేదికను పంపించడం జరిగిందని ఒకవేళ జిల్లా అధికారుల నుండి శిలాఫలకాన్ని పడగొట్టమని ఆదేశాలు వస్తే పోలీసుల సహకారంతో శిలాఫలకాన్ని వెంటనే తొలగిస్తామని ఎంపీడీఓ పాత్రికేయులతో అన్నారు.

ఎన్నికల తరుణంలో రాజు కుంటున్న రాజకీయ వేడిమరో రెండు వారాల్లో ఎన్నికల కోడ్ 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.ఈ తరుణంలో ఒక్కసారిగా మండలంలో రాజకీయ వేడి ఊపందు కుందనే చెప్పవచ్చు.శిలాఫలకం ప్రోటోకాల్ ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష నేతల పైనా లేక దీనికి సంబంధించిన అధికారులపైన ఎవరిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

About Author