రాహుల్ బజాజ్ ఇక లేరు !
1 min read
పల్లెవెలుగువెబ్ : బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన న్యూమోనియా, హృద్యోగ సమస్యలతో బాధపడుతున్నారు. గత నెలలో ఆయన పూణెలోని రుబీ హాల్ క్లినిక్‌లో చేరినట్టు ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వేజ్ గ్రాంట్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి వార్త తీరని విషాదాన్ని మిగిల్చిందని, బజాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు బజాజ్ గ్రూప్ ప్రకటించింది.