PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తాం

1 min read

డీసీసీ అధ్యక్షుడు షేక్ అల్లాబకాష్

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:గత నాలుగున్నరేళ్ళుకు పైగా రాష్ట్రంలో చీకటి రాజ్యం సాగుతుందని, చరిత్రలో ఇంతటితో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎవరు చూసి ఉండరని, ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని, న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేదని, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుకుగా చూసే నీచాతినీచమైన పాలన సాగుతుందని డిసిసి అధ్యక్షుడు షేక్ అల్లాబష్ అన్నారు.గురువారం స్థానిక పుల్లంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో (పుల్లంపేట) సిగమాల రమేష్, (కోడూరు) డాక్టర్ సయ్యద్ అహ్మద్, (ఓబులవారిపల్లె) హరి కృష్ణ రెడ్డి,(చిట్వేల్)  చల్లా శ్రీనివాస్, (పెనగలూరు)  వెంగయ్య లను మండల అధ్యక్షులు గా నియామక పత్రాలను అందించి న శుభ సందర్భంగా, తెలంగాణ  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆనందోత్సవంతో స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి పార్టీ కార్యాలయం వరకు పిసిసి రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ శాంతయ్య, కోడూరు నియోజకవర్గం బాధ్యురాలు గోసాల దేవి తోపాటు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ర్యాలీ  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం మొత్తం ఒకరిద్దరి చేతుల్లోనే కేంద్రీకృతం అయిందని మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాలుగామారారని, ప్రతిపక్షాలను తిట్టిపోసే మైకుల్లా మారాయాన్నిఆయన విమర్శించారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ శాంతయ్య, కోడూరు నియోజవర్గ బాధ్యురాలు గోసాల దేవి వారు మాట్లాడుతూ మీ చౌంగ్ తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలకు తక్షణం సహాయం ఎకరాకు 20 వేల రూపాయలు చొప్పున అందజేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్  చేశారు. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎన్నో ఎకరాలు  పంట నీట మునిగిందని, కౌలు రైతులు ఎకరాకు  35 నుంచి 40 వేల రూపాయల వరకు పెట్టిన పెట్టుబడి తుఫాన్ నట్టేట ముంచేసింది వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు  నాయకులు  తదితరులు  పాల్గొన్న వారు.

About Author