ఎన్డీఏకు కొత్త అర్థం చెప్పిన రాహుల్ గాంధీ !
1 min readపల్లెవెలుగువెబ్ : పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం తమ వద్ద సమాచారం లేదని బదులివ్వడంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం తీరును తప్పుబడుతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్‌డీఏ అంటే ‘నో డేటా అవైలబుల్’ అని సెటైర్లు వేశారు. ఓ జిఫ్ ఇమేజ్‌ను కూడా జత చేసి ట్వీట్ చేశారు.’ ఆక్సీజన్ కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు. నిరసనలు చేపట్టిన రైతుల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు. కాలినడక వల్ల ఒక్క వలస కూలీ కూడా మరణించలేదు. మూక దాడుల వల్ల ఒక్కరు కూడా మరణించలేదు. ఒక్క జర్నలిస్టును కూడా అరెస్టు చేయలేదు అని నో డేటా అవైలబుల్(ఎన్‌డీఏ) ప్రభుత్వం ప్రజల్ని నమ్మించాలనుకుంటుంది. డేటా లేదు. సమాధానం లేదు. జవాబుదారీ లేదు’ అని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.