NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం.. బిజెపి చేసే కుట్ర

1 min read

– కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు జై లక్ష్మీ నరసింహ యాదవ్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: “భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం.ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజేపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బిజేపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి..”ఆర్టికల్ 19 ప్రకారం బావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించడమే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న బిజెపి ప్రభుత్వం గుజరాత్ అల్లర్లు గతంలో నరేంద్ర మోడీ అమిత్ షా చేసినటువంటి శాశ్వతంగా రాజకీయాల్లో పోటీ చేయకుండా రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఉంది మతయుద్వేషాలు కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలు ఇంటికి స్వాగనింపడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

About Author