NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాహుల్ సంచ‌ల‌నం.. ఎంత‌టి వారినైనా కాంగ్రెస్ నుంచి పంపించేస్తాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలతో లాలూచీ పడితే సహించేది లేదని, ఎంత పెద్ద నేతలైనా కాంగ్రెస్‌ నుంచి బయటకు పంపిస్తామని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోదని రాహుల్‌ స్పష్టం చేశారు. హనుమకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జరిగిన ‘రైతు సంఘర్షణ సభ’లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం. ఇది కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య ప్రత్యక్ష యుద్ధం అని రాహుల్‌ అన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా అభివృద్ధి కలగానే ఉందని, తెలంగాణ వల్ల కేవలం ఒక్క కుటుంబానికే లబ్ధి జరిగిందన్నారు. తెలంగాణ కన్న కల ఏమైంది. తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా?. భర్తలను కోల్పోయి రైతుల భార్యలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరని’’ రాహుల్‌ ప్రశ్నించారు.

                          

About Author