అమర జవాన్ జ్యోతికి శంకుస్థాపన చేయనున్న రాహుల్
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చత్తీస్ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో నిర్మించనున్న అమర జవాన్ జ్యోతికి ఫిబ్రవరిలో భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ ప్రకటించారు. ఇందిరా గాంధీ హయాంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన అమర జవాన్ జ్యోతిని ఈ మధ్యే జాతీయ యుద్ధ స్మారకంలో మోదీ ప్రభుత్వం విలీనం చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ నేతృత్వంలోని బాఘేల్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాయ్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ సైనిక బలగాల 4వ బెటాలియన్ పరిసర ప్రాంతంలో అమర జవాన్ జ్యోతిని నిర్మించనున్నట్లు బాఘేల్ తెలిపారు.