PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ప్ర‌వేశించిన రాహుల్ యాత్ర‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర నేడు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ప్రారంభమై అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ సరిహద్దుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ భారత్ జోడో యాత్ర కాసేపట్లో డి.హీరేహాళ్ చేరుకోనుంది. రాహుల్ గాంధీ డి.హీరేహాళ్ లోని మారెమ్మ గుడి వద్ద విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సాయంత్రం ఓబుళాపురం మీదుగా ఆయన బళ్లారికి బయల్దేరతారు.

                                  

About Author