రైల్వేకు రూ. 259 కోట్ల నష్టం !
1 min readపల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సామూహిక నిరసనలు జరిగాయి. బీహార్ నుంచి తెలంగాణ వరకూ రైల్వే ఆస్తులపై దాడులు, ధ్వంసం చేయడం, నిప్పుపెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే బాగా నష్టపోగా, యూపీలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసలు వ్యక్తమయ్యాయి. ఈ ఆందోళనల కారణంగా జూన్ 15 నుంచి జూన్ 23 వరకూ 2132 పైగా రైళ్లు రద్దయ్యాయని మంత్రి తెలిపారు.