వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత వర్షం !
1 min readపల్లెవెలుగు వెబ్ : చైనాలోని హెనన్ ప్రావిన్సులో 1000 ఏళ్లలో ఎప్పుడూ కురవనంత వర్షం కురిసింది. ఈ కుంభవృష్టికి హెనన్ ప్రావిన్సులో భీకర వరదలు సంభవించాయి. ప్రావిన్సులోని అనేక ప్రాంతాలు నీటి మునిగాయి. వేలాది కార్లు నీటిలో తేలియాడుతున్నాయి. ఈ వర్షం ధాటికి సుమారు 12 మంది మృతిచెందినట్టు సమాచారం. దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హెనన్ ప్రావిన్సు అనేక వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు కేంద్రం. చైనాలోని అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంటు ఇక్కడే ఉంది. మంగళవారం ఒక్కరోజు 457 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి సగటున 640 మిల్లీ మీటర్ల వర్షం ఇక్కడ నమోదైంది. గత 1000 ఏళ్లలో ఇంత భారీస్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.