విద్యుత్ సబ్ స్టేషన్లో వర్షపు నీరు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : శనివారం ఆదివారం రాత్రి కురిసిన వర్షాల కు చెన్నూరులోని పలు వీధులు వర్షపు నీరుతో నిండిపోయాయి, లోతట్టు ప్రాంతాలైన చెన్నూరు భవాని నగర్, యానాదికాలని, బెస్త కాలనీ లలో వర్షంతో ఇండ్ల మధ్య నీళ్లు నిలవడంతో అక్కడికి కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది, అలాగే రామనపల్లి వంక వర్షపు నీటితో పొంగి పోర్లడం జరిగింది, అదేవిధంగా చెన్నూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో నీరు నిలవ చేరడంతో ఇక్కడి సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది, నీటిని బయటకు పంపేందుకు వారు తీవ్ర అవస్థలు ఎదుర్కోవడం జరిగింది, విద్యుత్ సబ్ స్టేషన్ లో వర్షపు నీరు ఎక్కువగా ఉండటం వల్ల, ఏవైనా చిన్న పొరపాటు జరుగుతే పెద్ద ప్రమాదాలు ముంచుకొస్తాయని దానికోసం తమ సిబ్బంది వర్షపు నీరు తీసేందుకు నానా అవస్థలు పడడం జరిగిందని ఏ ఈ రామలింగారెడ్డి తెలిపారు, ఏది ఏమైనప్పటికీ రెండు రోజులపాటు వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.