తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
1 min read
పల్లెవెలుగువెబ్ : తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా..తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో రెండ్రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇక ఏపీలో కూడా అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.