ఏపీలో వానలే వానలు.. ఎన్ని రోజులంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వానలు కురవనున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, అక్కడక్కడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం నాటి నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమూ ఉందని పేర్కొంది.