చేతులెత్తి మొక్కుతా.. అన్యాయం చేయొద్దు !
1 min readపల్లెవెలుగు వెబ్: కృష్ణా జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నట్టు తెలిపారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తికి అక్రమంగా నీటిని వినియోగించడం సరికాదన్నారు. వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆమె తెలిపారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ ను విమర్శించడం సరికాదన్నారు.