PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రైతన్న’ రిలీజ్ కి రెడీ అయ్యాడు

1 min read

సినిమా డెస్క్​: విప్లవ చిత్రాలు అనగానే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి ఆర్‌‌. నారాయణ మూర్తి. ఆయన రూపొందించిన దండోరా, శంఖారావం వంటి సినిమాలు అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన ఇలాంటి సినిమా ఒకటి తెరకెక్కించారు. దేశంలో రైతు సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలిసిందే. అదే ఇతివృత్తాని తీసుకుని ‘రైతన్న’ టైటిల్‌ సినిమాను రూపొందించారు. దీనికి తనే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తయి, విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రెస్ మీట్‌ నిర్వహించారు. రైతు చట్టాలపై ఈ సినిమా రూపొందించానని, సినిమాను త్వరలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, వంగపండు ప్రసాదరావు పాటలు పాడారు. వారికి ఆయన నివాళులు అర్పించారు. గద్దర్, గోరటి వెంకన్నతో పాటు పలువురు రాజకీయ నాయకులు, రైతు సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author