NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీపీఐ పత్తికొండ మండల కార్యదర్శిగా రాజా సాహెబ్ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: సిపిఐ పత్తికొండ మండల కార్యదర్శిగా డి రాజా సాహెబ్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిపిఐ నియోజకవర్గ స్థాయి 13 వ మహాసభలు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య పర్యవేక్షణలో జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పత్తికొండ మద్దికెర తుగ్గలి క్రిష్ణగిరి మండలాల కమిటీలను ఎన్నుకున్నారు. పోరాటాలకు కేంద్రబిందువుగా ఉన్న పత్తికొండ మండల కార్యదర్శిగా డి రాజా సాహెబ్ రెండోసారి ఎన్నిక కావడం పట్ల సిపిఐ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. 2019 సంవత్సరంలో తొలిసారిగా రాజా సాహెబ్ సిపిఐ మండల కార్యదర్శి గా ఎన్నికయ్యారు. తిరిగి 2022లో సిపిఐ మండల కార్యదర్శి గా ఎన్నిక కావడం గమనార్హం. విద్యార్థి సంఘాల్లో పనిచేస్తూ ప్రజా సంఘాలలో ప్రజా ఉద్యమాల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. ఏఐవైఎఫ్ తాలూకా కార్యదర్శిగాను ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు గాను సిపిఐ పట్టణ కార్యదర్శి గాను పనిచేస్తూ పేదలకు ఇళ్ల స్థలాల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల సాధనలో రాజా సాహెబ్ కీలకంగా వ్యవహరించారు.

About Author