రజకుల ఇళ్ళ పట్టాలు రజకులకె కేటాయించాలి..!
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా గోనేడండ్ల గ్రామ రజకులకు 1992 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం, 66 ఇళ్ళ పట్టాలు 3 సెంట్లు ప్రకారం కేటాయించింది. కేటాయించిన ఇళ్ళ పట్టాలకు పునాదులు కుడా వేశారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయ్యాయి. ఈ విషయమై ఎమ్మెల్యే చేన్నకేశవరెడ్డి దృష్టికి తీసుకెల్లాగా. ఆయన సానుకూలంగా స్పందించి రజకుల ఇళ్ళ పట్టాలు రజకులకే ఇస్తాం కాని 3 సెంట్లు ప్రకారం ఇవ్వండం కుదరదు 1.50 సెంట్ల ప్రకారం ఇస్తాం అని తెలిపారు. అందుకు రజకులు కూడా ఒప్పుకున్నారు. కాని రజకుల ఇళ్ళ పట్టాలలో 80 శాతం పట్టాలు రజకులకు కేటాయించి మిగత 20 శాతము ఇళ్ళ పట్టాలు ఇతర వర్గం వారికి కేటాయించారు. మా ఇళ్ల పట్టాలు మాకే కేటాయించాలని న్యాయం కోరుతు గోనేగండ్ల రజక సంఘం సభ్యులు సి . రవి కుమార్ సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు ఆర్జీ ద్వార ఫిర్యాదు చేశారు.