NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బెల్లంకొండ మూవీకి క్లాప్‌ కొట్టిన రాజమౌళి

1 min read

సినిమా డెస్క్​ : టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యాడు. ఇప్పుడు భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ శ్రీనివాస్‌కు కూడా ‘అల్లుడు శ్రీను’తో తెలుగులో తన తొలి సినిమాతోనే మాంచి హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే కాంబో తిరిగి బాలీవుడ్‌లో అడుగు పెడుతోంది. రెబల్‌ స్టార్‌‌ ప్రభాస్‌తో దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో సెన్సేషనల్‌ హిట్ట్యిన ‘ఛత్రపతి’ మూవీని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. శ్రీనివాస్‌ హీరో, వివి వినాయక్‌ డైరెక్టర్‌‌. పెన్ స్టూడియోస్ – పెన్ మారుధర్ సినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ధవల్ జయంతిలాల్ గడ మరియు అక్షయ్ జయంతిలాల్ గడా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

About Author