రాజమౌళి తండ్రి రాజ్యసభకు.. !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘బాహుబలి’ చిత్ర కథా రచయిత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి.. కోడూరి విశ్వ విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనతోపాటు ఇసైజ్ఞాని ఇళయరాజా, భారతదేశ తొలితరం మేటి అథ్లెట్లలో ఒకరైన పీటీ ఉష, ‘ధర్మస్థల’ క్షేత్ర ధర్మాధికారి, ప్రముఖ సంఘ సేవకుడు వీరేంద్ర హెగ్గడేను కూడా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నలుగురూ దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. విజయేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా.. ఇళయరాజా తమిళనాడు, వీరేంద్ర హెగ్గడే కర్ణాటక, పీటీ ఉష కేరళ రాష్ట్రానికి చెందినవారు. దక్షిణాదిన బీజేపీని విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే రాజ్యసభకు వీరిని నామినేట్ చేసినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.