మంత్రి పేర్ని నానిని కలిసిన రాజంపేట ఎమ్మెల్యే
1 min read
పల్లెవెలుగు వెబ్, కడప: మచిలీపట్నంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు రవాణా మరియు సమాచార శాఖ మంత్రి వర్యులు పేర్ని నానిని రాజంపేట శాసన సభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. అనంతరం రాజంపేట నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజంపేట అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని మంత్రి పేర్నినాని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెంకట మల్లికార్జున రెడ్డి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో MRKR Constructions and Pvt.Ltd అదినేత మేడా రఘునాథ రెడ్డి ఉన్నారు.