రాజంపేటను జిల్లాగా ప్రకటించాలి
1 min read
పల్లెవెలుగువెబ్ : రాజంపేటను జిల్లాను ప్రకటించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాగా రాయచోటిని కేంద్రంగా ప్రకటించడంతో తాళ్ళపాకలోని అన్నమయ్య విగ్రహం దగ్గర టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, తెదేపా పార్లమెంట్ అధికార ప్రతినిధి ప్రతాప్ రాజు, పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించకుండా రాయచోటిని ప్రకటించడంపై రాజంపేట ప్రజలు భగ్గుమంటున్నారని వారు పేర్కొన్నారు.