రాజరాజేశ్వరి పాఠశాల విద్యార్థినికి ప్రధమ బహుమతి
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : గ్రంథాలయ 56వ వారోత్సవాలలో ప్రధమ బహుమతి పొందిన శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల విద్యార్థిని గడివేముల గ్రామములోని గ్రంథాలయం వారు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ ఉద్యమకారుల సంస్మరణ కోసం గ్రంథాలయ అధికారి వి. వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో గడివేములలోని వివిధ రకాల పాఠశాలలు (శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ హై స్కూల్, మోడల్ స్కూల్, St.Paul School )వ్యాసరచన పోటీలలో మొత్తం 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయం వారు రెండు రకాల అంశములపై అనగా ఒకటి గ్రంథాలయం గురించి, రెండు ఓటు యొక్క ప్రత్యేకతపై వ్యాసరచన పోటీలను జరపడం జరిగినది. అందులో మొదటి బహుమతిని శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల కైవసం చేసుకున్నది. మొదటి బహుమతి పొందిన అమ్మాయి బి. శ్రీ భారతి D/o బి. శ్యాంసుందర్ రెడ్డి గడివేముల ప్రధమ బహుమతి వచ్చినందుకు శ్రీ రాజరాజేశ్వరి పాఠశాల కరస్పాండెంట్ చాలా సంతోషపడి మాట్లాడుతూ గ్రంథాలయం వారు నిర్వహించిన రెండు అంశములు చాలా ముఖ్యమైనవి గ్రంధాలయాల అవసరాన్ని ఆనాడే గుర్తించిన S.R. రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, గాడి చర్ల హరి సర్వోత్తమరావు ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. గ్రంథాలయం ద్వారా ప్రజలు విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు సమాజ అభివృద్ధిలో గ్రంథాలయం పాత్ర కీలకమని అన్నారు. 2 ఓటు యొక్క ప్రత్యేకత మన అందరికీ తెలుసు. ఓటేయ్ నీ కులానికో…… మతానికో కాదు సమాజ హితానికి మంచి వ్యక్తిత్వానికి ఓటేయండి. ఒక్క ఓటు మాత్రమే కదా అని తేలికగా తీసేయకండి ఆ ఒక్క ఓటు కూడా గెలుపోటములు నిర్ణయించవచ్చు. ధర్మాన్ని కాపాడే ఏ ఒక్క అవకాశాన్ని మనం వదలకూడదు. ఓటు కూడా అలాంటి అవకాశమె అని విద్యార్థులకు వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ తెలుసుకోవలసిన విషయాలివి. ప్రథమ బహుమతి పొందిన విద్యార్థిని బి.శ్రీ భారతి( 9వ తరగతి )కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ యం. రామేశ్వరరావు గారు, శ్రీ ఎం.బి.ఎన్. రాఘవేంద్రరావు గారు, ఎం. కృష్ణకాంత్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.