రాజధాని ఫైల్స్ సినిమా తో జగన్ రెడ్డి వెన్నులో వణుకు ఎందుకు?
1 min readమంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: రాజధాని ఫైల్స్ సినిమా తో జగన్ రెడ్డి కి వెన్నులో వణుకు ఎందుకు అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా చూసి ముఖ్యమంత్రి బయపడడం ఇదే తొలిసారి అని ఈ సినిమా రైతులు బతుకు చిత్రం అని దానిని అడ్డుకొనేందుకు ఈ వైసిపి ప్రభుత్వం నీచస్థితి కి దిగజారింది అన్నారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వైసిపి ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందని తెలిపారు. 34 వేల మంది రైతులు త్యాగాలు వాస్తు రూపంగా నిలిచిందని తెలిపారు. ఈ అమరావతి రైతులు ఉసురు జగన్ పోసుకున్నాడని తెలిపారు. రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం తీసిన ఈ సినిమాను ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల కలలు కన్న రాజధానిని తుగ్లక్ సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశాడని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు వేయించుకొని మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తాడేపల్లి తలుపులు మూసుకుపోయాయని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ రాజధాని అమరావతి అని ధీమా వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అని ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని వాళ్లు సంపాదించుకోవడం తప్ప వైసిపి మంత్రులు గాని ఎమ్మెల్యేలే గాని రాజధాని కోసం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందలేదని అన్ని మాటలు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.