PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీలోకి ఈటెల రాజేంద‌ర్ ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: టీఆర్ఎస్ మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ బీజేపీలోకి వెళ్లనున్నారా?. తెలంగాణ‌లో కేసీఆర్ వ్యతిరేఖ శ‌క్తులు ఏకం కానున్నాయా?. ఇలాంటి ప్రశ్నల‌తో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఈటెల రాజేంద‌ర్ చ‌ర్చ లేవ‌నెత్తారు. తాజాగా బీజేపీ నేత‌ల‌తో ఈటెల రాజేంద‌ర్ భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ నేత‌లు ఈటెల‌ను బీజేపీలో చేరాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఈటెల ఎలాంటి నిర్ణయం ప్రక‌టించ‌లేద‌ని స‌మాచారం. క‌లిసి టీఆర్ఎస్ మీద పోరాటం చేద్దామని బీజేపీ నేత‌లు కోరారు. అయితే.. త‌న అనుచ‌రుల‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాన‌ని ఈటెల రాజేంద‌ర్ చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈటెల రాజేంద‌ర్ తో వివేక్, కిష‌న్ రెడ్డి, డి.కె. అరుణ‌, జితేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు భేటీ అయ్యారు. న‌గ‌రంలోని ఓ ఫామ్ హౌజ్ లో వీరు భేటీ అయ్యారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ను ఎదుర్కొవాలంటే వ్యతిరేఖ శ‌క్తుల‌న్నీ ఏకం కావాల‌ని బీజేపీ నేత‌లు ఈటెల‌కు సూచించారు. అయితే.. కొత్త పార్టీ పెట్టాలా.. లేదా ఏదైన పార్టీలోకి చేరాల అన్న అంశం మీద ఈటెల రాజేంద‌ర్ క్లారిటీకి రాలేదు.

About Author