NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వారంలోపు బీజేపీలోకి ఈటెల రాజేంద‌ర్..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఎలాంటి హామీలు, ష‌ర‌తులు లేకుండా మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ బీజేపీలో చేరుతున్నట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ తెలిపారు. బీజేపీ సిద్దాంతాలు, ప్రధాని పాల‌న న‌చ్చి ఈటెల రాజేంద‌ర్ బీజేపీలో చేరుతున్నట్టు సంజ‌య్ ప్రక‌టించారు. వారంలోపు ఈటెల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ఆయ‌న తెలిపారు. పార్టీకి, ప‌ద‌వికి రాజీనామ చేసే బీజేపీలో చేరుతార‌ని స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల స‌ల‌హా తీసుకున్న అనంత‌రం ఈటెల రాజేంద‌ర్ ఆధ్వర్యంలో వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరుతార‌ని బండి సంజ‌య్ తెలిపారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత క‌ల్వకుంట్ల , ఓవైసీ ఫ్యామిలీలు త‌ప్ప ఇంకెవ్వరు బాగుప‌డ‌లేద‌ని విమ‌ర్శించారు. తెలంగాణవాదుల‌కు బీజేపీ మంచి వేదిక అవుతుంద‌ని అన్నారు.

About Author