PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వార్షిక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. తిరువళ్వార్‌ సూక్తులతో బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన.. బడ్జెట్‌ వివరాలను సభకు వివరించారు. మధ్యమధ్యలో గురజాడ అప్పారావు, శ్రీశ్రీ కవితలను చదివి వినిపించారు. విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుందన్న మంత్రి బుగ్గన.. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన పలు నివేదికల్లో ఏపీకి దక్కిన ఘనత గురించి వివరించారు. సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలు చేయడం.. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. ఇక 2022-23 వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు గా పేర్కొన్న మంత్రి బుగ్గన.. రెవెన్యూ వ్యవయం రూ. 2, 08, 261 కోట్లు, మూల ధన వ్యవయం రూ. 47, 996 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 17, 036 కోట్లు, ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లు, జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా బడ్జెట్‌లో పొందుపర్చారు.

                                  

About Author