NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ర‌జినీకాంత్.. రాజ‌కీయాల్లోకి రావడం లేదు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రావ‌డంలేద‌ని మ‌రోసారి స్పష్టం చేశారు. ర‌జినీ మ‌క్కళ్ మండ్రం స‌భ్యుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. క‌రోన ప‌రిస్థితులు, వైద్య ప‌రీక్షల నిమిత్తం మ‌క్కళ్ మండ్రం నిర్వాహ‌కుల‌తో స‌మావేశం కానందున‌.. ఈ రోజు వారితో భేటీ అయిన‌ట్టు తెలిపారు. త‌న రాజ‌కీయ అరంగేట్రంపై త‌న అభిమానుల‌కు సందేహాలున్నాయ‌ని అన్నారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తానా? రానా? అన్న అంశం పై వారు త‌నును అడుగుతున్నార‌ని ర‌జినీ తెలిపారు. తాను రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని, మ‌క్కళ్ మండ్రం ర‌ద్దు చేస్తున్నాన‌ని ప్రక‌టించారు. దాని స్థానంలో ర‌జ‌ని అభిమాన సంక్షేమం మండ్రం ఏర్పాటు చేస్తున్నట్టు ర‌జ‌నీకాంత్ ప్రక‌టించారు. దీంతో ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌న్న పుకార్లుకు ఫుల్ స్టాప్ ప‌డింది.

About Author