PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ‌కీయాల్లోకి రావ‌డం పై ర‌జినీ మ‌రోసారి ప్ర‌క‌ట‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజకీయాల్లోకి వచ్చే విషయంపై సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా ప్రకటన చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో చెన్నై రాజ్‌భవన్‌లో సమావేశమై బయటకు వచ్చాక ఆయన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. గవర్నర్‌తో జరిగిన చర్చల్లో రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని రజినీ చెప్పారు. అయితే తాను రాజకీయాల్లోకి రాబోనని తేల్చి చెప్పేశారు. తమిళనాడులో కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, అంతకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని బాగా ప్రచారం జరిగింది. నిజానికి కొన్నేళ్లుగా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు కూడా. అయితే తాను రాజకీయాలకు రాబోనని సూపర్ స్టార్ మరోమారు స్పష్టం చేశారు.

                                     

About Author